`అంథాధూన్` రీమేక్ కోసం టాలీవుడ్ లో ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రీమేక్‌లో నితిన్ కథానాయకుడిగా నటించబోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. స్క్రిప్టు సిద్ధమైంది. అయితే.. ఓ కీలకమైన పాత్ర కోసం ఇంకా అన్వేషణ సాగుతూనే ఉంది. `అంథాధూన్`లో టబు ఓ కీలకమైన పాత్ర లో నటించింది. ఆ సినిమా మొత్తానికి టబు పాత్ర హైలెట్. ఆమె నటన, గ్రే షేడ్స్ లో ఆ పాత్ర ని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకున్నాయి. ఆ పాత్రలో ఇప్పుడు ఎవరు కనిపిస్తారన్నది పెద్ద ప్రశ్న. టబుని అడిగితే.. నో చెప్పింది. శిల్పాశెట్టి పేరు పరిశీలించి పక్కన పెట్టారు. ఇలియానాని తీసుకుందామనుకున్నారు. కానీ కుదరడం లేదు. ఇప్పుడు నయనతార పేరు పరిశీలిస్తున్నారు.
ఈ సినిమా చేయడానికి నయన ఒప్పుకుంటే నిజంగా ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ వస్తుంది. కానీ ఇక్కడ రెండు మూడు ఇబ్బందులున్నాయి. నెగిటీవ్ పాత్రలు చేయడానికి నయన ఒప్పుకుంటుందా? లేదా? అనేది పెద్ద ప్రశ్న. పైగా తెలుగు సినిమాలంటే నయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ ఒప్పుకున్నా పారితోషికం మాత్రం భారీగా డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ తట్టుకోవడం నిర్మాతలకు కష్టమే. పైగా నయనతార ఎంట్రీ ఇస్తే.. ఇది నయనతార సినిమాగా చలామణీ అయిపోతుంది. నితిన్ సైడ్ అయిపోతాడు. నయన డామినేషన్ ని నితిన్ తట్టుకోవడం కష్టమే. ఎలా చూసినా.. నయన మంచి ఆప్షనే. కానీ.. ఇన్ని పరిమితులున్నాయి. మరి నితిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో?