గ్లామ్‌షాట్‌: మేఘాల్లో 'నయనా'నందమే

మరిన్ని వార్తలు

ఫోటోలో కనిపిస్తున్నది దుబాయ్‌లోని ఓ ల్యాండ్‌ మార్క్‌ బిల్డింగ్‌. ఇటీవలే ఓపెన్‌ చేశారు. ఈ బిల్డింగ్‌ దగ్గర నిండుగా మేఘాల రంగు గౌనులో అందంగా మురిసిపోతోన్న ముద్దుగుమ్మ నయనతారను చూశారు కదా. ఎత్తైన అందమైన ఆ బిల్డింగ్‌. అంతే అందంగా ఎట్రాక్ట్‌ చేస్తున్న నయనతార అందం. ఇంతకీ ఈ లుక్‌ ఎందులోనిదంటారా? బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్న 'జై సింహా' సినిమాలోనిది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. అక్కడి అందాలకు మైమర్చిపోతూ నయనతార ఇలా ఈ బిల్డింగ్‌ దగ్గర తన అందాలను పోటీకి పెట్టింది. నిజంగా పిక్‌ సూపర్బ్‌గా ఉంది. నయనతార అందం, ఆకాశాన్నంటుతున్నట్లున్న ఆ పొడవాటి బిల్డింగ్‌ అందంతో పోటీ పడుతున్నట్లే ఉంది కదా!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS