సౌత్ ఇండియాలోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచింది నయనతార. తన ఖాతాలో ఇప్పుడు మరో సినిమా చేరింది. అదే 'నెట్రికన్' . ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే... ఇందులో నయన్ అంధురాలిగా నటిస్తోంది. ఇదో మర్డర్ మిస్టరీ. ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిణిగా నయనతార నటిస్తున్నారు. మిలింద్‌రావ్ దర్శకత్వం వహిస్తుండగా నయనతార ప్రియుడు విఘ్నేష్‌శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈచిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తార్ట.
నయన ఇది వరకు లేడీ ఓరియెంటెడ్ కథలు చాలా చేసింది. అయితే అంధురాలిగా మాత్రం కనిపించలేదు. ఇది తనకు కొత్త తరహా పాత్రే. ఈ సినిమాకి నయనతార కు కాబోయే భర్త విఘ్నేష్ నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో మరింత ఆసక్తి పెరిగింది. 2021లో ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇదే యేడాది నయన నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయని, ఆ రెండు చిత్రాలకూ విఘ్నేష్‌నే నిర్మాత అని తెలుస్తోంది.