లేడీ సూపర్ స్టార్ నయన తార ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు. 40 పై బడినా కానీ కుర్ర హీరోయిన్ లకి గట్టి పోటీ ఇస్తోంది. నయన్ కెరియర్ ముగిసింది అన్న టైమ్ లో కెరటంలా ఉవ్వెత్తున లేచింది. ఓ పక్క కమర్షియల్ మూవీస్ లో నటిస్తూనే, లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటిస్తోంది. కేవలం నయన తార కోసమే కథలు రాసుకున్న దర్శకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు , తమిళం , మలయాళం భాషల్లో నటిస్తూనే, రీసెంట్ గా బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ , అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యం లో అమ్మడికి బాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. కానీ దేనికి ఓకే చెప్పటం లేదు నయన్.
సల్మాన్ ఖాన్ హీరోగా మురుగుదాస్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అయితే ఈ ఆఫర్ ముందు నయన తారకి వచ్చింది అని, కానీ నయన్ నో చెప్పిందని టాక్. సల్మాన్ సరసన నయనతార అయితే బాగుంటుందని, ఈ పెయిర్ కొత్తగా ఉంటుందని, మురగదాస్ నయనతారని, సంప్రదించారని, అసలు నయననే దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నారని, అందుకే ముందుగా ఆమెకే కథ చెప్పారని టాక్. కానీ నయన్ రిజెక్ట్ చేసింది. ఈ న్యూస్ విన్న ఫాన్స్ మంచి ఆఫర్ తమ హీరోయిన్ ఎందుకు వదులుకుంది అని బాధ పడుతున్నారు.
మురుగుదాస్ లాంటి స్టార్ డైరక్టర్, సల్మాన్ లాంటి స్టార్ హీరో కి నయన్ ఎందుకు నో చెప్పింది. కారణం ఏంటి. లేడి సూపర్ స్టార్ రూటే సపరేట్ తాను ఒకే మాట పై ఉంటుంది, తనకి ఇష్టం లేని పని, ఎవరు చెప్పినా చేయదు. ఇప్పడు కూడా స్టోరీ నచ్చక నో చెప్పిందా? ఆ సినిమాలో ఆమె పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందా? లేదా సల్మాన్ తో నటించటం ఇష్టం లేక నో అన్నదా అన్న విషయం తెలియదు. మురుగుదాస్ ఎంత కన్విన్స్ చేసినా, నయన్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. స్టోరీ నచ్చకపోతే పెద్ద స్టార్ అయినా, డబుల్ రెమ్యునరేషన్ ఆపర్ చేసినా నయనతార ఒప్పుకోదు. అలా 'సికందర్' మూవీ కూడా వదులుకుంది.