Nayanthara: నయ‌న‌తార స‌రోగ‌సీ చ‌ట్ట‌బ‌ద్ద‌మేనా?

మరిన్ని వార్తలు

న‌య‌న‌తార త‌ల్లైంది. అద్దె గ‌ర్భం ద్వారా క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. న‌య‌న భ‌ర్త‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించి, త‌మ ఆనందాన్ని పంచుకొన్నాడు. అభిమానులు కూడా న‌య‌న‌కు క‌వ‌ల పిల్ల‌లంటే సంతోషించారు. అయితే.. ఇప్పుడు స‌రోగసీ ద్వారా ఇలా త‌ల్లి అవ్వ‌డం వివాదాస్ప‌దం అవుతోంది.

 

స‌రోగ‌సీ విష‌యంలో కొన్ని నియ‌మాలు ఉన్నాయి. పెళ్ల‌యిన 5 ఏళ్ల త‌ర‌వాతే.. స‌రోగ‌సీ ద్వారా పిల్ల‌లు క‌నే అనుమ‌తి ఉంటుంది. కానీ న‌య‌న‌కు పెళ్ల‌యి కేవ‌లం 4 నెల‌లే అయ్యింది. అంటే.. న‌య‌న‌తార రూల్స్ ని అతిక్ర‌మించింద‌న్న‌మాట‌. ఈ విష‌యాన్ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకొంది. అస‌లు న‌య‌న స‌రోగ‌సీ అంతా ప్రోసెస్ ప్ర‌కార‌మే జ‌రిగిందా, లేదా? చ‌ట్ట‌ప‌రంగా అనుమ‌తులు ఉన్నాయా? అనే విష‌యంపై.. ఆరా తీస్తోంది వైద్య ఆరోగ్య శాఖ‌. దీనిపై ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌బోతున్నారు. అంటే.. న‌య‌న‌తార‌నీ, ఆమె భ‌ర్త విఘ్నేష్ నీ, స‌రోగ‌సీ ద్వారా న‌య‌న త‌ల్ల‌వ‌డానికి స‌హాయం చేసి, అద్దె గ‌ర్భాన్ని అందించిన మ‌హిళ‌నూ... విచార‌ణ చేస్తార‌న్న‌మాట‌.

 

మ‌రోవైపు స‌రోగ‌సీ ద్వారా న‌య‌న‌తార త‌ల్లి అవ్వ‌డం త‌మిళ నాట కొంత‌మందికి న‌చ్చ‌డం లేదు. దాంతో ప‌రోక్షంగా న‌య‌న‌ని టార్గెట్ చేస్తూకామెంట్లు పెడుతున్నారు. న‌య‌న త‌న గ్లామ‌ర్ ని కాపాడుకోవ‌డానికే అద్దె గ‌ర్భాన్ని ఆశ్ర‌యించింద‌ని, అలాంటి వాళ్ల‌కు తల్ల‌య్యే అర్హ‌త లేదంటూ ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. స‌రోగ‌సీ విధానాన్నే ర‌ద్దు చేయాల‌ని కొంత‌మంది డిమాండ్ చేస్తున్నారు.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS