నయనతారా! నువ్వెప్పుడు ఆ విషయం చెప్పేది?

మరిన్ని వార్తలు

ఇండస్ట్రీలో లవ్‌ బర్ట్స్‌ సహజమే. అయితే ఈ మధ్య లవ్‌ బర్డ్స్‌ పెళ్లి ముడితో ఒక్కటయ్యేందుకు ఆశక్తి చూపిస్తున్నారు. ప్రేమ వార్తలతో సెన్సేషన్‌ అవ్వడమే కాదు, పెద్దలను ఒప్పించి, పెళ్లి పీటల దాకా కూడా వెళుతున్నారు. అలాంటిది సౌత్‌ క్వీన్‌ నయనతార మాత్రం ప్రేమతోనే సెన్సేషన్‌ సృష్టిస్తోంది కానీ, పెళ్లి కబురు విషయానికి వచ్చేసరికి 'ఆ ఒక్కటీ అడగొద్దు' అనేలా టాపిక్‌ డైవర్ట్‌ చేస్తోంది. 

సౌత్‌లో నయనతార 'లవ్‌ సెన్సేషన్‌' అంతా ఇంతా కాదు. ఆమె ఎవరితో ప్రేమలో ఉన్నా, సంచలన స్థాయిలోనే ఆ ప్రేమ ఒలకబోసింది. తమిళ హీరో శింబు, ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా ఇలా తదితరులు నయనతార ప్రేమ బంధంలో చిక్కుకుని వివిధ కారణాలతో తృటిలో పెళ్లి బంధాన్ని తప్పించుకుని బయట పడ్డవాళ్లే. అయితే తాజాగా నయన్‌ తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందిప్పుడు. విహార యాత్రలంటూ, బర్త్‌డేలంటూ, ఇతరత్రా ఫంక్షన్స్‌ అంటూ ఈ ప్రేమ జంట సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. విఘ్నేష్‌ శివన్‌కి నయనతార ఎంత ప్రత్యేకమో చాలా సార్లు ఇప్పటికే తన ట్వీట్స్‌ ద్వారా ప్రూవ్‌ చేసుకున్నాడు. 

ఇక నయన్‌ వంతే మిగిలుంది. ఈ ముద్దుగుమ్మ తన నోట పెళ్లి మాట ఎప్పుడు చెప్పనుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా అమెరికాలో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసి తిరిగొస్తూ ఈ జంట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. ఇకపోతే తెలుగులో నయనతార బిగ్‌ ప్రాజెక్ట్‌ అయిన 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తోంది. తమిళంలో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS