గ్లామ్‌షాట్‌: కిల్లింగ్‌ లుక్స్‌లో 'చిరుత' పిల్ల '

By iQlikMovies - September 30, 2019 - 18:19 PM IST

మరిన్ని వార్తలు

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..' అంటాడు ఓ హీరో, హీరోయిన్‌ని. కానీ, హీరోయిన్స్‌ చేసేదదే కదా.. వద్దంటే మానేస్తారా? తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో హల్‌చల్‌ చేస్తోంది. ఎవరిదా పిక్‌ అంటే, ఇంకెందుకు హింట్‌ ఇచ్చేశాం కదా.. చిరుత పిల్ల నేహా శర్మ. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో 'చిరుత' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఘనంగా ఉన్నప్పటికీ, కంటిన్యూషన్‌ లేదు పాపకి పాపం. ఆ తర్వాత 'కుర్రాడు' తదితర ఒకటీ అరా సినిమాల్లో నటించింది.

 

కానీ, అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. అయితే, సోషల్‌ మీడియాలో మాత్రం తనదైన ముద్ర వేసింది. హాట్‌ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ ఓ రేంజ్‌ క్రేజ్‌ దక్కించుకుంది. ఏదో ఒక రకంగా క్రేజ్‌ నిలబెట్టుకోవాలిగా. ఆ క్రమంలోనే తాజాగా గ్రీన్‌ కలర్‌ డ్రస్స్‌లో ఓ హాట్‌ పోజిచ్చింది. ఏమాటకామాటే చెప్పాలి, ఈ పిక్‌ సింప్లీ సూపర్బ్‌. నేహా హాట్‌ హాట్‌ అందాల విందుకు కెమెరామెన్‌ పనితనం కూడా తోడవ్వడంతో, నెటిజన్స్‌ని బాగా ఆకర్షిస్తోంది ఈ పిక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS