రానా చేసిన జోగేంద్ర పాత్రకి ఆడియన్స్ ఫిదా అయ్యారు అని కచ్చితంగా చెప్పొచ్చు. దీనికి ఆధారంగా నేనే రాజు నేనే మంత్రి మొదటిరోజు కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే తెలిసిపోతుంది.
ఈ చిత్రానికి మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ 5 కోట్లు (గ్రాస్) అలాగే రూ 3.6 కోట్ల (షేర్) పైగా వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ పరంగా దూసుకుపోనుంది అని చెప్పవచ్చు.
ఇక USA, ఇతర ప్రాంతాల్లో మొత్తంగా కలిపి మొదటి రోజు సుమారు రూ 4.75 కోట్ల (షేర్) అలాగే రూ 7.8 కోట్ల (గ్రాస్) కలెక్షన్స్ వచ్చాయి. రాబోయే నాలుగు రోజులు సెలవ రోజులు కావడంతో కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం రూ 20 నుండి 25 కోట్లు కొల్లగొట్టచ్చు అని ట్రేడ్ వర్గాల అంచనా.