'చావడానికి వస్తున్నారో? లేక వచ్చాక చస్తున్నారో?' అంటూ ఓ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఆది హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'నెక్స్ట్ నువ్వే' చిత్రంలోనిది ఈ డైలాగ్. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. వైభవి, బ్రహ్మాజీ, రేష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్ డైరెక్టర్‌గా మారి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అన్ని కమర్షియల్ అంశాలతో పాటు, ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. సరదా సరదాగా స్టార్ట్ అయిన ట్రైలర్ చివరికి సస్పెన్స్ టచ్ ఇచ్చి ఎండ్ చేశారు. తొలి సినిమాకే సస్పెన్స్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్న ప్రభాకర్ సరికొత్త కాన్సెప్ట్‌ని పరిచయం చేయనున్నాడట 'నెక్స్ట్ నువ్వే' సినిమాతో. ఓ హోటల్‌లో దిగిన పలువురు సడెన్‌గా చనిపోతూ ఉంటారు. వారెందుకు చనిపోతున్నారో తెలియక హీరో ఆది అది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. 'బాస్ నెక్స్ట్ నువ్వే..' అనే డైలాగ్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తోంది ట్రైలర్‌లో. ఇంతవరకూ ఇలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే తెరకెక్కాయి. అయితే ఏదో కొత్తగా చూపిస్తానంటున్నాడు ప్రభాకర్. అదేంటో తెరపైనే చూడాలంటున్నాడు. ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రేష్మి చాలా హాట్‌గా కనిపిస్తోంది ట్రైలర్‌లో. కామెడీకి పెద్ద పీట వేస్తూనే, సస్పెన్స్ టచ్ కొంచెం ఘాటుగానే తగిలించినట్లుంది ట్రైలర్ చూస్తుంటే. వీ4 మూవీస్ పతాకంపై ఈ సినిమాని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. నవంబర్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.