బాహుబలితో పెరిగిన ఇండియన్ సినిమా ప్రతిష్టను మరో మెట్టు ఎక్కించిన సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు భాషతో సంబంధం లేకుండా నటించి మెప్పించారు. మెగా డాటర్ నిహారిక కూడా ఓ కీలక పాత్రలో కనిపించింది. సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిహారిక, మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. చిరంజీవిని ఆప్యాయంగా హగ్ చేసుకున్న ఫోటోని పోస్ట్ చేస్తూ, నేను హగ్ చేసుకుంది డాడీని కాదు. తెలుగు సినిమా గర్వాన్ని.
ఈ పోస్ట్ పెడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. లవ్ యూ డాడీ.. బాస్ బస్టర్.. అంటూ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిహారిక. విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా 'సైరా' ప్రమోషన్స్‌ని ఘనంగా చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్‌లో ఇంతవరకూ ఎక్కడా నిహారిక కనిపించలేదు. తాజాగా నిహారిక చేసిన ఈ పోస్ట్ మెగా లెవల్లో ఉందంటూ మెగా అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
I’m not just hugging my Daddy, I’m hugging INDIAN CINEMA’s PRIDE!
— Niharika Konidela (@IamNiharikaK) October 3, 2019
Will always be a proud #Megastar fan🤩🙏🏼
Love you daddy!🤗🤗🙏🏼 #BOSSBUSTER #SYERAA!😍🤩🥳 pic.twitter.com/SwG0O23nSM
ఈ సినిమాలో నిహారిక గిరిజన యువతిగా కనిపించింది. స్క్రీన్ స్పేస్ చాలా కొద్ది నిమిషాలే అయినా, తన పరిమితి మేరకు బాగా నటించింది. క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్లో కూడా తనదైన శైలిలో తళుక్కున మెరిసింది. మెగా డాటర్ అయినా, తానూ చిరంజీవి అభిమానినే అని ఈ సందర్భంగా నిహారిక చెప్పుకొచ్చింది.