రాజమౌళి ఎవరని అడిగితే చిన్న పిల్లాడికైనా సమాధానం తెలుస్తుంది. అలాగే 'బాహుబలి' అంటే రాజమౌళి, రాజమౌళి అంటే 'బాహుబలి' ఈ విషయం తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ తెలుగు సినీ ప్రముఖుడు 'బాహుబలి' డైరెక్టర్ ఎవరో తెలీదన్నాడట. ఎవరితీఓ అనుకుంటున్నారా? 'కొమరం పులి' సినిమాలో పవన్ కళ్యాన్‌కి జోడీగా నటించిన ముద్దుగుమ్మ నికీషా పటేల్ గుర్తుండే ఉంటుంది కదా. ఆ ముద్దుగుమ్మతోనే సదరు వ్యక్తి ఈ మాట అన్నాడట. ఆ మాట వినగానే అమ్మడికి చాలా కోపం వచ్చిందట. ఇవన్నీ మీడియాతో అమ్మడు ముచ్చటిస్తోంది. అసలు బాహుబలి సినిమాని తెలుగు ఇండస్ట్రీలో ఓ యజ్ఞంలా భావిస్తున్నారంతా. ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరూ 'బాహుబలి'కి యాంటీగా ఒక్క మాట చెప్పలేదు. అందరూ ప్రోత్సహించిన వారే. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన సినిమా 'బాహుబలి' అని ప్రశంసిస్తున్న వారే. అలాంటిది ఈ టైంలో అమ్మడితో అలా అన్న ఆ వ్యక్తి ఎవరో కానీ, ఇదంతా ఈ ముద్దుగుమ్మ పబ్లిసిటీ కోసమే చేస్తోందని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవును నిజమే ఇప్పుడు నికీషా పటేల్‌కి హీరోయిన్గా అవకాశాలు లేవు. జనం ఆమెని ఎప్పుడో మర్చిపోయారు. అందుకే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న 'బాహుబలి'పై వివాదం తీసుకొచ్చి, పబ్లిసిటీ స్టంట్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది కాబోలు. మరో మాటేంటంటే ఆ వ్యక్తి ఎవరంటే పేరు చెప్పనంటోంది. అక్కడే తెలిసిపోవడం లేదు అమ్మడి ప్లానింగ్ ఏంటో. ఏదేమైనా ఈ తాజా వివాదంతో ఆమె పేరు మార్మోగిపోతోంది.