చందు మొండేటి..కార్తికేయ, ప్రేమమ్ తరువాత సవ్యసాచి లాంటి డిజాస్టర్ ఇచ్చి, కార్తికేయ 2 అనే సినిమా కోసం స్ట్రగుల్ పడుతున్నారు. మధ్యలో కిర్రాక్ పార్టీ అనే ఫెయిల్యూర్ కు మాటలు కూడా అందించారు. ఇలాంటి టైమ్ లో ఆయన ఓ రెండుపావు నిమషాల విడియో తయారు చేసారు. యూట్యూబ్ లో దొరికే పలు క్లిప్ లు, అలాగే కొంతమంది హీరోయిన్లు, హీరో నిఖిల్ వాళ్ల వాళ్ల ఐ ఫోన్ ల్లో షూట్ చేసిన బైట్ లు, మధ్యలో సిమ్ రిలీఫ్ ఫండ్ కు ఇచ్చిన డొనేషన్ బిట్ ఒకటి యాడ్ చేసి, ఈ విడియోను తయారు చేసారు.
ఇందులో మేజర్ శ్రమ అంతా ఎడిటర్ దే. ఏం కావాలి..ఏం పెట్టాలి అన్నది చందు చెప్పి వుండొచ్చు. దీనికి ఓ పాట, దానికి అనూప్ ఓ ట్యూన్. టోటల్ గా చూస్తే, ఏ మాత్రం ఇంప్రెస్ గా లేదు. అబ్బో..ఆహా అనేటట్లూ లేదు. నిజానికి ఇలాంటి టైమ్ లో చందు ఎలాంటి విడియో వదలాలి. చూడగానే మెస్మరైజ్ కావాలి. అదిరిందిగా..అనేట్లు వుండాలి. చందు టాలెంట్ మిస్సయింది సరైన సినిమా పడక అన్నట్లు వుండాలి. కానీ అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు. ఏదో ఒక యూ ట్యూబ్ చానెల్ కోసం తయారుచేసినట్లు వుంది. నిఖిల్ ను, ఆ స్టార్స్ క్లిప్ ను పక్కన పెడితే అస్సలు నథింగ్. గమ్మత్తు ఏమిటంటే, దీనికి నిర్మాత వైకాపా ఎంపీ, వైకాపా కీలక నేత విజయసాయిరెడ్డి. ఆ రేంజ్ పెద్ద మనిషి పేరు నిర్మాతగా వున్నపుడు ఇది ఏ రేంజ్ లో వుండాలి?