ముగ్గురూ ముగ్గురే కుమ్మేశారు

మరిన్ని వార్తలు

నాని మరోసారి విజయం అందుకున్నాడు. ఈ రోజు 'నిన్ను కోరి' సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ఎప్పటిలానే ప్రేక్షకుల ఆదరణ పొందింది. నానికి తిరుగులేని విజయం అందించింది. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌కి బాగా రీచ్‌ అయ్యింది. నాని నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లవ్‌ ఫెయిల్యూర్‌ అబ్బాయిగా నాని పండించే హావభావాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో మరో హీరో ఆది పినిశెట్టి గురించి అంతా చర్చించుకుంటున్నారు. అలాగే ముద్దుగుమ్మ నివేదా థామస్‌. ఈ భామ తొలి సినిమా 'జెంటిల్‌మెన్‌'తోనే నటనలో వందకి వంద మార్కులు సాధించేసింది. ఇప్పుడు ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేసింది. ముగ్గురుకి ముగ్గురూ పోటీ పడి నటించారు. ఎమోషన్‌ సీన్స్‌లో ఈ ముగ్గురి పెర్ఫామెన్స్‌ అదరిపోయిందనే టాక్‌ వినిపిస్తోంది. 'వైశాలి' సినిమాలో ఆది పినిశెట్టి మంచి నటన కనబరిచాడు. అదే రేంజ్‌లో ఈ సినిమాలో ఆది నటన ఉందంటూ ప్రముఖుల విమర్శలు అందుకుంటున్నాడు. సాధారణ ట్రయాంగిల్‌ సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉందంటున్నారు. లవ్‌లో ఫెయిల్‌ అయితే ఇక జీవితం నాశనమైపోయినట్లే కాదు, జీవితం ఇంకా ఎన్నో అవకాశాల్ని చూపిస్తుంది అనే యూత్‌ఫుల్‌ కనెక్టింగ్‌ మెసేజ్‌తో ఈ సినిమా తెరకెక్కింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్‌ చూస్తుంటే, మరో మంచి విజయం నాని, నివేదా ఖాతాలో పడ్డట్లే అనిపిస్తోంది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS