నితిన్ సీక్రెట్ పోలీసా??

మరిన్ని వార్తలు

అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ సినిమాల‌తో ఆక‌ట్టుకొన్నాడు హ‌ను రాఘ‌వ‌పూడి. ఇప్పుడు నితిన్‌తో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్ర‌స్ట్రింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే... ఇందులో నితిన్ ఓ సీక్రెట్ పోలీస్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరిగే అబ్బాయిగా నితిన్ పాత్ర‌ని ఇంట్ర‌డ్యూస్ చేసి.. చివ‌ర్లో ఇత‌నో అండ‌ర్ కాప్ పోలీస్ అంటూ... ట్విస్ట్ ఇస్తార‌ట‌. సీక్రెట్‌గా ఉంచాల్సిన ఈ మేట‌ర్ ముందేలీక్ అయిపోయింది. దాంతో.. చిత్ర బృందంలో టెన్ష‌న్ మొద‌లవ్వ‌డం ఖాయం. అన్న‌ట్టు ఇదో పోలీస్ స్టోరీనే అయినా.. హ‌ను రాఘ‌వ‌పూడి దీనికో ల‌వ్ స్టోరీ ట‌చ్ ఇవ్వ‌బోతున్నాడ‌ని, ఆ ల‌వ్ స్టోరీ చాలా కొత్త‌గా ప్లాన్ చేశాడ‌ని తెలుస్తోంది. నితిన్ త‌న కెరీర్‌లో ఎప్పుడూ కాప్ స్టోరీ చేయలేదు. ఈ విధంగా నితిన్‌కి ఇది కొత్త పాత్రే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS