కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. సినిమా, టీవీలు కూడా అతీతం కాదు. బిగ్ బాస్ 4 సీజన్ ఎప్పుడో మొదలవ్వాల్సింది. కానీ...కరోనా వల్ల కుదర్లేదు. ఈనెలాఖరున `బిగ్ బాస్ 4` ప్రారంభం కాబోతోందని సమాచారం. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈసారి షో 50 రోజులే అని, ఇదివరకటిలా ఎక్కువమంది కంటెస్టెంట్లు ఉండరని ప్రచారం జరుగుతోంది.
కానీ.. ఈ షో ఎప్పటిలానే జరగబోతోందట. వంద రోజులు పాటు ఈ షో నిర్వహించనున్నారని, ఇది వరకటిలానే 16 మంది కంటెస్టెంట్లు పాల్గొంటారని తెలుస్తోంది. షో ప్రారంభానికి ముందే ఆ కంటెస్టెంట్లకు హోం క్వారెంటైన్‌కి తరలిస్తారని, 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంచాకే.. షో మొదలెడతారని తెలుస్తోంది. ఈసారి ప్రైజ్ మనీ 50 లక్షలు ఉంటుందా? దాన్ని 75 లక్షలు చేస్తారా? అనే విషయం మాత్రం తేలాల్సివుంది.