టెంపర్‌ 'ఐటెమ్‌' అదిరేటి గ్లామర్‌.!

By iQlikMovies - July 18, 2018 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

పిక్‌లో ఎల్లో కలర్‌లో హాట్‌ అప్పీల్‌ ఇస్తున్న బ్యూటీ ఎవరనుకుంటున్నారా? నోరా ఫతేహి. ఈ పేరు ఎక్కడా వినలేదనుకుంటున్నారా? అదేనండీ 'టెంపర్‌' సన్నీలియోన్‌. టెంపర్‌ సన్నీలియోన్‌ ఏంటీ క్లియర్‌గా చెప్పాలంటారా? ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన 'టెంపర్‌' సినిమాలో వైజాగ్‌ సన్నీలియోన్‌ అంటూ ప్రకాష్‌రాజ్‌ పరిచయం చేస్తాడు కదా. ఆ సన్నీలియోనే ఈ నోరా ఫతేహి అన్నమా. 

ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా. ఆ తర్వాత తెలుగులో 'బాహుబలి', 'లోఫర్‌', 'ఊపిరి' తదితర చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌తో కట్టి పడేసింది. ఇప్పుడు ఈ హాట్‌ బ్యూటీ బాలీవుడ్‌లో బిజీగా ఉంది. 'టెంపర్‌'లో అమ్మడు చేసిన ఐటెం సాంగ్‌లో నడుం తిప్పుడుకి అందరూ షాక్‌ అయ్యారు. అస్సలు ఒంట్లో ఎముకలున్నాయా? అన్నట్లుగా పాట మొత్తం తన నడుమొంపులు చూపిస్తూనే ఉందీ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతం 'దిల్‌ బర్‌ దిల్‌ బర్‌..' అంటూ బాలీవుడ్‌ ప్రేక్షకులకు తన వయ్యారాలతో కిక్‌ ఇస్తోంది. త్వరలో విడుదల కానున్న 'సత్యమేవజయతే' సినిమాలోనిదీ సాంగ్‌. ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఈ సాంగ్‌తోనే ఓ ఊపు ఊపేస్తోంది హాట్‌ హాట్‌ నోరా ఫతేహి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS