ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012 మరియు 2013 సంవత్సరాలకు సంబంధించి జాతీయ చలనచిత్ర అవార్డులని ప్రకటించింది.
ఇక ఈ అవార్డుల కమిటిలో హీరో బాలకృష్ణ, మురళీమోహన్, రమేశ్ ప్రసాద్ అలాగే వరప్రసాద్ రెడ్డి గార్లు సభ్యులుగా ఈ అవార్డులకి సరైన వ్యక్తులని ఎంపిక చేశారు.
అవార్డు గ్రహీతల పేర్లు ఇవే-
ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు- ఎస్పీ బాలసుబ్రమణ్యం (2012), హేమామాలిని (2013).
బీఎన్ రెడ్డీ జాతీయ చలనచిత్ర అవార్డు- సింగీతం శ్రీనివాసరావు (2012), కోదండరామి రెడ్డి (2013).
నాగిరెడ్డి & చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు- దగ్గుబాటి సురేష్ (2012), దిల్ రాజు (2013).
రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు- కోడి రామకృష్ణ (2012), వాణిశ్రీ (2013).
ఈ అవార్డులని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా త్వరలో జరగబోయే నంది అవార్డుల ప్రదానోత్సవంలో పురస్కార గ్రహీతలకి ప్రధానం చేయనున్నారు.