Bimbisara, NTR: 'బింబిసార' రివ్యూ ఇచ్చేసిన ఎన్టీఆర్‌

మరిన్ని వార్తలు

క‌ల్యాణ్ రామ్ ఆశ‌ల‌న్నీ ఇప్పుడు `బింబిసార‌`పైనే ఉన్నాయి. ఈ సినిమా పై క‌ల్యాణ్ రామ్ భారీగా ఖ‌ర్చు పెట్టాడు. ప్ర‌మోష‌న్లు కూడా గ‌ట్టిగానే చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. క‌ల్యాణ్ రామ్ సినిమా అంటే.. ప్ర‌మోష‌న్ల‌కు ఎన్టీఆర్ రావ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈసారీ అంతే. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి ఎన్టీఆర్ అతిథిగా రాబోతున్నాడు. దానికంటే ముందే.. `బింబిసార‌` షో.. ఎన్టీఆర్ కోసం ప్ర‌త్యేకంగా వేశారు. బింబిసార చూసిన ఎన్టీఆర్‌.. అన్న క‌ల్యాణ్ రామ్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయాడ‌ట‌.

 

సినిమా చూసి బ‌య‌ట‌కు రాగానే `ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది చూడండి` అంటూ రివ్యూ ఇచ్చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు వశిష్ట ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే చిత్ర‌బృందం మాత్రం ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తేల్చేసింది.

 

''బింబిసార‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌రు. అయితే పార్ట్ 2లో కొత్త పాత్ర‌లు వ‌స్తాయి. అప్పుడు అదృష్టం బాగుండి, మాకు అవ‌కాశం ఇస్తే... ఎన్టీఆర్ ని చూడొచ్చు. కానీ ఇప్పుడు దీని గురించి ఇప్పుడే ఏం చెప్ప‌లేను. ఎందుకంటే బింబిసార 2 క‌థ పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వ‌లేదు'' అని క్లారిటీ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. ఆగ‌స్టు 5న బింబిసార విడుదల అవుతున్న సంగ‌తి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS