ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమం ఫిబ్రవరి 24న జరగనున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. తాజాగా నందమూరి ఇంట విషాదం చోటుచేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు చిత్రబృందం ట్వీట్ చేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పింది.
‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రానున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఎన్టీఆర్ అభిమానులు భారీగా అంచనాలుపెట్టుకున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. జాన్వీకపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం వుంది.