ఏంటా లింక్ అనుకుంటున్నారా? ఈ మూడు సినిమాలతోనూ లింక్ ఉన్న ముగ్గురు ఈ సినిమాలో నటిస్తున్నారు. నాగార్జున 'ఆఫీసర్'. నాగార్జున కోడలు సమంత 'అభిమన్యుడు'లో హీరోయిన్. ఇది ఓకే. మరి రాజుగాడుకి నాగార్జునకీ లింకేంటనుకుంటున్నారా? అవును ఈ సినిమా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకి, శిష్యురాలు సంజనా రెడ్డి. ఈమె దర్శకత్వంలోనే 'రాజుగాడు' తెరకెక్కింది.
ఇలా ఈ మూడు చిత్రాలకూ ఓ స్పెషల్ లింక్ ఉంది. ఇకపోతే ఇటు పర్‌ఫామెన్స్ పరంగా యాక్షన్ హీరోగా నాగార్జున సరికొత్త క్రేజ్‌నిస్తుండగా, అదే పర్‌ఫామెన్స్‌లో నాగ్ కోడలు సమంత కూడా మామగారికి గట్టి పోటీనిస్తోంది. 'అభిమన్యుడు'లో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపిస్తోంది. యాక్టింగ్‌కి స్కోపున్న పాత్ర ఆమెది ఈ సినిమాలో. ఈ మధ్య సమంత ఎంచుకునే పాత్రలన్నీ యాక్టింగ్‌కి స్కోపున్న పాత్రలే కావడం విశేషం.
ఇకపోతే 'రాజుగాడు' చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమవుతోంది సంజనా రెడ్డి. రామ్‌గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు చిత్రాలకు పని చేసిన అనుభవం ఉంది సంజనా రెడ్డికి. తన డైరెక్షన్‌లో కొన్ని స్పెషల్ ఫ్రేమ్స్‌కి వర్మ మార్క్ టేకింగ్ కనిపించే అవకాశాలు లేకపోలేవు. ఏది ఏమైనా ఒకే రోజు విడుదలకు పోటీ పడుతున్న ఈ మూడు సినిమాల కథలూ వేటికవే విభిన్నమైనవి.
డిఫరెంట్ జోనర్స్‌లో, డిఫరెంట్ టేకింగ్స్‌తో వస్తున్న చిత్రాలు. 'రాజుగాడు' కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాగా, 'అభిమన్యుడు' సైబర్ క్రైమ్ థ్రిల్లర్. ఇక 'ఆఫసీర్' పక్కా యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైనర్. స్మాల్ లింక్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూడు సినిమాల్లో గెలుపెవరిదో చూడాలిక.