'ఆఫీసర్‌' రిపోర్టింగ్‌ అదుర్స్‌

By iQlikMovies - June 01, 2018 - 12:29 PM IST

మరిన్ని వార్తలు

నాగార్జున - రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆఫీసర్‌' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిన్న అర్ధరాత్రి నుండే కొన్ని చోట్ల షోలు పడ్డాయి. ఈ ప్రీ రిలీజ్‌ షోస్‌ నుండి వస్తున్న రిపోర్ట్స్‌ పోజిటివ్‌గా వస్తున్నాయి. ఈ సినిమా చూశాక ఆర్జీవీ ఫ్యాన్స్‌, నాగార్జున ఫ్యాన్స్‌ చాలా హ్యాపీ ఫీలవుతున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'ఆఫీసర్‌' అంచనాల్ని అందుకునే దిశగా రూపొందిందంటూ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ చేసుకుంటున్నారు.

ఇక వర్మ టేకింగ్‌, సౌండింగ్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ ఈ సినిమాకి బాగా కలిసొచ్చేలా ఉన్నాయనీ అంటున్నారు. తన ప్రతీ సినిమాకి టెక్నికల్‌గా ఏదో కొత్తదనం చూపించే వర్మ, ఈ సినిమాలో చూపించిన టెక్నికల్‌ టాలెంట్‌ని అంతా మెచ్చుకుంటున్నారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కట్టి పడేసేలా ఉన్నాయట. స్టోరీకి కనెక్షన్‌ లేదు కానీ, అప్పట్లో వచ్చిన 'శివ' సినిమాకి 'ఆఫీసర్‌' మెచ్యూర్డ్‌ వెర్షన్‌ అని చెప్పుకుంటున్నారు.

అలాగే యాక్షన్‌ సీన్స్‌లో నాగార్జున పర్ఫామెన్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. నాగార్జున కూతురుగా నటించిన కావ్య నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే టోటల్‌గా ఇదంతా ఫ్యాన్స్‌ టాక్‌ మాత్రమే. ఫైనల్‌ టాక్‌ ఏంటో కాస్పేసట్లో రానుంది. ఈ రోజు 'ఆఫీసర్‌తో పాటు మరో రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి.

విశాల్‌ నటించిన అనువాద చిత్రం 'అభిమన్యుడు' ఒకటి కాగా, మరో చిత్రం యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటించిన 'రాజుగాడు'. అభిమన్యున్ని, రాజుగాడిని సీనియర్‌ హీరో ఆఫీసర్‌ ఎలా బీట్‌ చేశాడో తెలియాలంటే ఫైనల్‌ రిపోర్ట్స్‌ వచ్చేదాకా ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS