పద్మావతి నుండి పద్మావత్ కి టైటిల్ మార్చడం అలాగే సినిమాలో ఎవరి మనోభావాలైనా దెబ్బతినేలా సన్నివేశాలు ఉంటాయి అన్న చిన్న అనుమానం కలిగినా ఆ సన్నివేశాలని తొలగించడం వంటివి చేసాక విడుదలవుతున్నది ఈ భారీ చిత్రం.
ఇక ఇన్ని అడ్డంకుల తరువాత విడుదలవుతున్న ఈ చిత్రానికి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో కర్ణిసేన వారు ఒక ధియేటర్ ని టార్గెట్ చేసుకుని విధ్వంసం సృష్టించారు. అక్కడే ఉన్న వాహనాలని కొందరు తగలబెట్టగా ఇంకొంతమంది ఆ ధియేటర్లకి నిప్పు పెట్టారు. దీనితో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది.
పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో- మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లలో కూడా కర్ణిసేన ఆధ్వర్యంలో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.
అయితే సినిమాలో రాజ్ పుత్ ల ప్రతిష్ట దెబ్బతీసేలా ఎటువంటి అంశం కాని సన్నివేశం కానీ లేదు అని పద్మావత్ టీం చెబుతున్నా ఇప్పుడు ఎవరు వినే పరిస్థితిలో లేరు అదే విధంగా సుప్రీమ్ కోర్టు తీర్పుని కూడా వీరు గౌరవించకపోవడం గమనార్హం.. శోచనీయం..