పైసా వసూల్ స్టంపర్ టాక్

By iQlikMovies - July 28, 2017 - 11:16 AM IST

మరిన్ని వార్తలు

అసలు ఈ స్టంపర్ చూసాక- బాలయ్య ఇన్నిరోజులు పూరి జగన్నాధ్ తో ఎందుకు సినిమా తీయలేదో అన్న డౌట్ మనకి వస్తుంది.

ఇక ఈ ‘టీజర్ కా బాప్’ ‘ట్రైలర్ కా భేటా’ అంటూవిడుదల చేసిన పైసా వసూల్ స్టంపర్ చూస్తే ఒక్కసారిగా ఈ సినిమా పై అంచనాలు పీక్స్ కి వెళ్ళిపోతాయి.

స్టంపర్ మొదలవుతూనే-

బాలకృష్ణ:  అన్నా... రెండు బాల్కనీ టికెట్లు కావాలి..

ఆ.. ఇది సినిమా కాదు... (పూరి వాయిస్)...

బాలకృష్ణ: సినిమా కాకపోతే ఇంకేంటి? I am the Hero… You are the Comedian… And Villain touched my Heroine… This is an action film...

ఈ డైలాగ్ తో ఈ సినిమాలో పూరి బాలకృష్ణని ఏలా చూపెట్టనున్నాడో, ఏమి చేయించనున్నాడో అని మనకి అర్ధమైపోతుంది...

ఇక ఇప్పటినుండి మొదలయింది బాలకృష్ణ స్టైల్ లో పూరి మార్క్ డైలాగ్స్-

తమ్ముడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా... కాని అందులో పులి నాలానే ఉంటుంది అని చాలా మంది చెప్పారు... అది నిజమో కాదో మీరే చెప్పాలి...

ఇక అనుప్ రూబెన్స్ ఇచ్చిన వసూల్... వసూల్ అనే ట్రాక్ మంచి కిక్ ఇస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా బాలకృష్ణని స్టైలిష్ గా చూపెట్టాడు పూరి.

ఫైనల్ గా... నేను మందేసిన మదపుటేనుగుని రా... Crush Everyone... అంటూ స్టంపర్ ని గ్రాండ్ గా ముంగిచేశాడు.

మరి ఈ స్టంపర్ చూసాక అందరికి అనిపించే ఏకైక ఫీలింగ్- బాలకృష్ణ పైసా వసూల్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ రికార్డు నెలకొల్పనుంది అని...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS