బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా వెకేషన్ ఎంజాయ్మెంట్లో బిజీగా గడుపుతోంది. బీచ్‌లో బికినీలు ధరించి మురిసిపోతోంది. ఆ వెకేషన్ పిక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఫ్యాన్స్ నుండి కామెంట్స్ కోరుతోంది. మరింకెందుకాలస్యం మీరూ ఈ పిక్స్ చూసి, మీకు తోచిన కామెంట్స్ పోస్ట్ చేయండి బాస్. పిక్ విషయానికి వస్తే, బ్లాక్ కలర్ సింగిల్ పీస్ స్విమ్ సూట్లో సముద్రం మధ్యలో నెట్లో జలకాలాడుతోంది. కళ్లకు సన్ గ్లాసెస్ ధరించి నవ్వులు చిందిస్తోంది. పిక్‌ని క్లిక్‌మనిపించిన కెమెరామెన్ పనితనం చాలా అద్భుతంగా ఉందని చెప్పక తప్పదు. సుదూరంగా కనిపిస్తున్న నీలాకాశం సముద్రంతో కలిసిపోయిందా? పరిణీతి అందాల్ని ముద్డాడుతోందా? అనేలా ఉంది పిక్.
ఇక పరిణీతి చోప్రా విషయానికి వస్తే, ఎప్పటి నుండో తెలుగులో తెరంగేట్రం చేస్తుందనే రూమర్స్ వస్తున్నాయి కానీ, ఆ ఆరంగేట్రానికి ఏర్పాట్లేమీ జరగుతున్నట్లు కనిపించడం లేదు. బాలీవుడ్లో అయితే, బాగానే బిజీగా గడుపుతోందనుకోండి. ప్రస్తుతం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ బయోపిక్ కోసం బ్యాడ్మింటన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది పరిణీతి చోప్రా. దీంతో పాటు, పరిణీతి నటించిన 'ది గాళ్ ఆన్ ది ట్రైన్' మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.