గీత గోవిందంతో సూపర్ హిట్టు కొట్టిన పరశురామ్... ఆ వెంటనే మహేష్ బాబు సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం అందుకున్నాడు. `సర్కారు వారి పాట`... తన కెరీర్‌లో అందుకున్న అతి పెద్ద అవకాశం. ఈ సినిమాతో నిరూపించుకుంటే, తను టాప్ లీగ్ లో చేరిపోవొచ్చు. అయితే ఈ ఛాన్స్‌ని పరశురామ్ చేతులారా చేజార్చుకున్నాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. సర్కారు వారి పాటకు డివైడ్ టాక్ వస్తోంది. కథలో లోపాలే సినిమా హిట్ కాకుండా వెనక్కి లాగాయన్నది విశ్లేషకుల మాట. స్వతహాగా రచయిత అయ్యుండి చిన్న చిన్న లాజిక్కులను... పరశురామ్ మిస్సయిపోయాడు.
ముఖ్యంగా కీర్తి సురేష్ మహేష్ దగ్గర తీసుకున్న అప్పుతో.. అసలు కథ మొదలదవుతుంది. కీర్తికి.. ముందు 10 వేల డాలర్లు, ఆ తరవాత 25 వేల డాలర్లు అప్పుగా ఇస్తాడు. అంటే మొత్తం. 35 వేల డాలర్లు. అయితే.. ఆ అప్పు వసూలు చేసుకోవడానికి విశాఖపట్నం వచ్చిన మహేష్ `నా పది వేల డాలర్లు... నాకిస్తే.` అంటుంటాడు. ఇంత చిన్న లాజిక్ ని పరశురామ్ ఎలా వదిలేశాడో.. అర్థం కాలేదు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా మొదలైపోయాయి. సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడికీ ఈ పది వేల డాలర్ల డైలాగ్ పంటికింద రాయిలా తగులుతోంది. కనీసం డబ్బింగ్‌లో అయినా.. పరశురామ్ దాన్నికరెక్ట్ చేసుకుని ఉండాల్సింది.