సర్కారు వారి పాట తరవాత.... పరశురామ్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. నాగ చైతన్యకు ఓ కథ చెప్పాడు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఈమధ్య విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాడన్న ప్రకటన బయటకు వచ్చింది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. అయితే.. ఈ ప్రాజెక్టు కూడా గందరగోళంలో పడింది. సర్కారు వారి పాట తరవాత గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడట పరశురామ్. విజయ్ దేవరకొండతో పరశురామ్ ములాఖాత్ కూడా గీతా ఆర్ట్స్ ద్వారానే అయ్యింది. అలాంటప్పుడు ఈ సినిమాని దిల్ రాజుకి ఎందుకు చేయాల్సివచ్చింది? అందుకే పరశురామ్ పై అల్లు అరవింద్ ఫైర్ అవుతున్నాడు. ఈ సినిమా ఎలా చేస్తావో నేనూ చూస్తా... అని సవాల్ విసిరాడట. ఈ వ్యవహారం మొత్తం ఓ ప్రెస్ మీట్ పెట్టి, మీడియా ముందుకు తీసుకురావాలని అల్లు అరవింద్ భావించాడు. కానీ.. దిల్ రాజుతో తనకున్న వ్యవహారాలు దెబ్బ తింటాయన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టలేదు.
ఈలోగా.. అల్లు అరవింద్‌ని కూల్ చేసేందుకు రంగంలోకి దిగాడు పరశురామ్. తను ఎలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేయాల్సివచ్చిందో అల్లు అరవింద్‌కి వివరించాడట. అంతేకాదు... గీతా ఆర్ట్స్‌లో తప్పకుండా ఓ సినిమా చేస్తానని, హీరోగా ఎవరిని ఇచ్చినా ఫర్వాలేదని, పారితోషికం విషయంలోనూ బెట్టు చేయనని.. ఇలా హామీల వరద కురిపించాడట. దాంతో.. అల్లు అరవింద్ కూల్ అయినట్టు టాక్. అల్లు అర్జున్ హీరోగా, పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందని వార్తలొస్తున్నాయి. అందులో నిజమెంతో తెలీదు కానీ, గీతా ఆర్ట్స్‌లో పరశురామ్ సినిమా మాత్రం ఖాయమే.