కన్నడ సూపర్ స్టార్ లేటు రాజ్ కుమార్ భార్య పార్వతమ్మ రాజ్ కుమార్ (77) ఇక లేరు.
గత కొంతకాలంగా క్యాన్సర్ తో భాదపడుతున్న ఆమె ఈ రోజు తెల్లవారుజామున 4.40లకు ఏం ఎస్ రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ ఆమె మరణానికి కారణం అని వైద్యులు గుర్తించారు. ఇక ఈ విషయాన్ని ఆమె రెండవ కుమారుడైన రాఘవేంద్ర రాజ్ కుమార్ దృవీకరించారు.
పార్వతమ్మ, రాజ్ కుమార్ భార్యగానే కాకుండా దాదాపు 80 కన్నడ చిత్రాలను నిర్మించిన నిర్మాతగా కూడా సుపరిచితమే. జన సందర్శన కోసం ఆమె మృతదేహాన్ని పూర్ణ ప్రజ్ఞ గార్డెన్స్ కి తరలించారు. ఈరోజు సాయంత్రం ఆమె పార్దివ శరీరాన్ని కంటీరవ స్టూడియోస్ లోని రాజ్ కుమార్ సమాధి పక్కనే ఖననం చేయనున్నారు.
రాజ్ కుమార్- పార్వతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కొడుకులు- శివ,రాఘవేంద్ర, పునీత్ లు కన్నడలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు.
ఈ సందర్భంగా, iQlikmovies.com తరపున పార్వతమ్మ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాము.