ఈ సంవత్సరానికి గాను పద్మ అవార్డులని కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ అవార్డులలో సినిమా పరిశ్రమ నుండి ఇళయరాజాకి పద్మ విభూషణ్ అవార్డు లభించింది.
ఈ విషయం పక్కన పెడితే, మన తెలుగు చిత్రసీమలో చాలా మందికి అర్హులైనప్పటికి ఇంకా అవార్డులు దక్కలేదు అన్న అభిప్రాయం చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పద్మ అవార్డుల సందర్భంగా ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే- స్వర్గీయ ఎస్.వీ. రంగారావు, మహానటి సావిత్రిలకి పద్మ అవార్డులని మరణానంతరం ఇవ్వచ్చు అని అలాగే ఈ అంశం పైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమవంతు ప్రయత్నం చేయాలి అని విజ్ఞప్తి చేశారు.
మొత్తానికి ఈ ప్రకటనతో మరోసారి ‘పద్మ’ అవార్డుల విషయంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయం గురించి మరోసారి చర్చకి ఈ ప్రకటన తోడ్పడనుంది.