పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి తెలంగాణ ప్రాంతంలో పర్యటన ప్రారంబించడం, ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలకి తన ఎంట్రీ ఇదే అన్నట్టుగా సంకేతాలు ఇవ్వడంతో ఇంటా బయట ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
వీరిలో సగటు అభిమానులతో పాటు మెగా హీరోలు అయిన రామ్ చరణ్, సాయి ధరం తేజ్ & వరుణ్ తేజ్ లు పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలియచేశారు. ఇక ఈ సమయంలో అల్లు అర్జున్ నుండి కూడా ఇటువంటి సంకేతం ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ ఊహించారు.
అయితే అలాంటిది ఏమి లేకపోవడంతో వీరివురి మధ్య మాటలు లేవు అన్నది మరోసారి స్పష్టమైంది అని తెలుస్తున్నది. ఆడియో విడుదల వేడుకల్లో పవన్ కళ్యాణ్ గురించిన నినాదాలు ఆయన లేనప్పుడు కూడా చేస్తుండడాన్ని ఆయన ప్రశ్నించినప్పటి నుండి ఈ వివాదం మొదలైంది.
ఏదేమైనా ఇటువంటివి సహజమే భవిష్యత్తులో మళ్ళీ సత్సంబంధాలు పునరావృతం అవుతాయి అని ఆశిస్తున్నవారు లేకపోలేదు.