ఎన్టీఆర్‌తో పవన్‌: అభిమానులకి పండగే

మరిన్ని వార్తలు

పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌ ఒకే చోట కనిపిస్తే ఇరువురు హీరోల అభిమానులకీ అది పండగే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా లాంఛనంగా నేడే ప్రారంభమయ్యింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హాజరు కావడం గమనించదగ్గ అంశం. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇదే బ్యానర్‌లో త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే ఎన్టీఆర్‌ హీరోగా సినిమా ప్రారంభమయ్యింది. దాంతో పవన్‌కళ్యాణ్‌, ఈ సినిమాకి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌తో చాలా సరదాగా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకుంది. సాధారణంగా సింప్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పవన్‌, ఇక్కడా అదే సింప్లిసిటీని ప్రదర్శించాడు. వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో పవన్‌ అప్పీయరెన్స్‌కి అక్కడున్నవారంతా ఫిదా అయ్యారు. ఇక ఎన్టీఆర్-పవన్ లు ఇద్దరు ఆ ఫంక్షన్ మొత్తం మాట్లాడుకుంటూ దర్శకుడు త్రివిక్రమ్ ని సరదాగా ఆటపట్టిస్తూ ఉండడం కనిపించింది. ముఖ్యంగా ముహూర్తం టైం అయినప్పుడు క్లాప్ కొట్టే సమయంలో పవన్-త్రివిక్రమ్ కలిసి అక్కడున్నవారి పైన ముఖ్యంగా త్రివిక్రమ్ పైన పేల్చిన జోకులు అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచ్చేత్తాయి. ఇంకో వైపున ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్నాడు. ఇదొక కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని సమాచారమ్‌. ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్‌ డిటెయిల్స్‌ వెల్లడి కావాల్సి ఉంది. త్వరలోనే సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది. ఎన్టీఆర్‌ ఇటీవలే 'జై లవ కుశ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసినదే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS