భీమ్లా నాయక్ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మరో సినిమా రాలేదు. సాయి ధరమ్ తేజ, మూవీ 'బ్రో' లో పవన్ మెరిసినా పూర్తిగా అది పవన్ సినిమా కాదు. దీనితో పవన్ ఫాన్స్ ఎప్పుడెప్పుడు తమ హీరో ని సిల్వర్ స్క్రిన్ పై చూస్తామని ఆశగా ఎదురురుచూస్తున్నారు. పవన్ ప్రజంట్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించటంతో సినిమాలకి కొంచెం బ్రేక్ ఇచ్చారు. మార్చ్ ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎన్నికపై ద్రుష్టి పెట్టి తన కాన్సంట్రేషన్ మొత్తం, రాజకీయాలకే వినియోగిస్తున్నారు.
పవన్ కమిట్ అయిన 'OG ' ఉస్తాద్ భగత్ సింగ్. హరి హర వీరమల్లు సినిమాలు ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఎలక్షన్ కి ముందే OG , ఉస్తాద్ భగత్ సింగ్ వస్తాయని ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయిందని టాక్ వచ్చింది కానీ, ఇప్పుడు వాటికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. హరి హర వీరమల్లు మూవీ అయితే వీటి అన్నిటికంటే ముందే స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పటికి ఇది పట్టాలెక్కలేదు. ఈ మూడు సినిమాలు పెండింగ్ లో ఉండగానే, ఇప్పుడు పవన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడని సమాచారం.
జవాన్ తో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో పవన్ సినిమా చేయనున్నారని పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెప్తున్నారు. పవన్ ఈ మూవీ చేసేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేసారని టాక్. జవాన్ తరువాత అట్లీ పేరు మారు మ్రోగింది. నార్త్ హీరోలు కూడా అట్లీ తో కలిసి వర్క్ చేయటానికి ఎదురుచూస్తున్నారు. నేషనల్ స్టార్ బన్నీ, అట్లీ కాంబోలో మూవీ ఉంటుందని, అఫీషియల్‌గానే న్యూస్ బయటకి వచ్చింది. ఇప్పుడు అట్లీ తో పవన్ కళ్యాణ్ సినిమా అంటే, ఈ వార్తల్లో ఎంత నిజముందో చూడాల్సి ఉంది. బన్నీ తో అట్లీ మూవీ ఉందా లేదా? పవన్ తో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుంది అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో పవన్ కూటమి విజయం సాధిస్తే, ప్రభుత్వంలో భాగం అయితే, పవన్ నుంచి సినిమాలు వస్తాయా? ఇలాంటి టైమ్ లో పవన్ కొత్త సినిమాలు ఒప్పుకున్నాడా అని అందరిలో సంశయం తలెత్తింది.