బండ్ల గణేష్ కి మరో సినిమా చేసి పెడతాని పవన్ కల్యాణ్ మాట ఇవ్వడం టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈమధ్య బండ్లని హీరోలంతా దూరం పెట్టారు. ఇలాంటి తరుణంలో.. పవన్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవ్వడం టాక్ ఆఫ్ ది టౌనే కదా. బండ్ల పవన్ చేతికి భారీ అడ్వాన్స్ ఇచ్చాడని, సింగిల్ పేమెంట్ తో.. పారితోషికాన్ని సెటిల్ చేశాడని, అందుకే పవన్ ఓకే అనేశాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లోపాయకారిగా జరిగిన తమ చర్చలు బయటకు రావడం పట్ల బండ్ల కాస్త అసంతృప్తిగానే ఉన్నాడు.
`నా వీపు పై కొట్టండి.. పొట్టపై పొట్టొద్దు` అంటూ సెంటిమెంట్ డైలాగులతో ఈ సినిమా గురించి తాను చెప్పేంత వరకూ ఏమీ రాయొద్దని వాపోతున్నాడు. బండ్ల భయం అర్థం చేసుకోదగినదే. పవన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇలాంటి వార్తలు బయటకు పొక్కినందుకు పవన్ కోపగించుకుని, సినిమా చేయనంటాడేమో అని బండ్ల గణేష్ భయం. పవన్‌తో సినిమా అంటే బండ్ల కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. అందుకే ఈ ప్రాజెక్టుని కామ్ గా పట్టాలెక్కిద్దామని డిసైడ్ అయిపోయాడు.
పవన్ కి సరిపడా కథ గురించి, పవన్ ని హ్యాండిల్ చేసే దర్శకుడి గురించీ.. బండ్ల తీవ్రంగా అన్వేషిస్తున్నాడని, ఇప్పటికే ఒకరిద్దరు దర్శకులకు టచ్‌లో వెళ్లాడని టాలీవుడ్ టాక్. మరి ఆ శుభవార్త ఎప్పుడు చెబుతాడో?
వీపుమీద కొట్టండి .కానీ నీ దయ చేసి కడుపు మీద కొట్టకండి ......ఇది నా విన్నపం .నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన 🙏🙏🙏🙏
— BANDLA GANESH. (@ganeshbandla) October 11, 2020