దైవం మానుష్య రూపేణా

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఈ పేరే ఓ ప్ర‌భంజ‌నం. హీరోల‌కు అభిమానులుంటారు. కానీ ఆ అభిమానుల్ని అనుచ‌రులుగా, ఆ అనుచ‌రుల్ని భ‌క్తులుగా మార్చుకున్నాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. అడిగిన వాళ్ల‌కు, అడ‌గ‌నివాళ్ల‌కు సైతం సాయం చేసి - త‌న గొప్ప మ‌న‌సుని చాలా సార్లు చాటుకున్నాడు. ప‌వ‌న్ చేసే సాయం, ఇచ్చే విత‌ర‌ణ‌లు చూస్తే.. ప‌వ‌న్ అంటే జ‌నానికి ఎందుకింత అభిమాన‌మో అర్థం అవుతుంది. ప‌వ‌న్ చేసిన సాయాల్ని లెక్క‌గ‌ట్ట‌లేం. కానీ.. కొన్ని సంద‌ర్భాల్ని మాత్రం గుర్తు చేసుకోవొచ్చు.


* గురువు సత్యానంద్ గారి చెల్లి పెళ్లికి ఆ రోజుల్లోనే లక్ష ఇచ్చాడు, అప్ప‌ట్లో.. తాను హీరోగా కూడా పెద్ద‌గా సెటిల్ అయ్యింది లేదు.


*  అసిస్టెంట్ డైరెక్టర్ కు జబ్బు చేస్తే వైద్యం కోసం 15 లక్షలు ఇచ్చాడు, తన సినిమా ఫ్లాప్ అయి నష్టాలు వస్తే తీసుకున్న డబ్బులో సగం తిరిగి ఇచ్చేస్తాడు,


* ఖమ్మంలో వృద్ధాశ్రమం నడుపుకునే అమ్మ తన ఇంటికి సాయం కోసం వస్తే లక్ష, పదివేలు సాయం చేసాడు, క్యాన్సర్ తో పోరాడుతున్న శ్రీజ కి పునర్జన్మ ఇచ్చాడు,


* అంగ వైకల్యం తో బాధ పడుతున్న చిన్నారికి చక్రాల కుర్చీ, వైద్యానికి డబ్బులు ఇచ్చాడు, అంధుల క్రికెట్ పోటీకి అతిధిగా వెళ్లి ఒక్కో జట్టుకు లక్ష, ఆ క్రికెట్ బోర్డ్ నడిపే అసోసియేషన్ కి 10 లక్షలు సాయం చేసాడు,


* వైజాగ్ కి హుద్ హుద్ తుఫాను వస్తే అప్పుడు బ్యాంక్ లో 60 లక్షల ఉంటే 50 లక్షలు ఇచ్చేసాడు, గుంటూరులో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి, నిత్యాన్నదానం కోసం 1 కోటి 30 లక్షల విరాళం ఇచ్చాడు, కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర భక్తుల వసతి కోసం షెడ్డు కట్టించాడు, పవన్ కళ్యాణ్ అనే పేరుతో బాటు జనసేన అధినేత అని వేస్తామని గుడి వాళ్ళు చెప్తే గుళ్లో రాజకీయాలు ఎందుకు సినిమా హీరో అని వేయండి చాలు అన్నాడు,


* కరీంనగర్ కొండగట్టు అంజన్న గుడికి 20లక్షలు విరాళం ఇచ్చాడు, ఆదిలాబాద్ తండాల్లో తాగు నీళ్లకు ఇబ్బంది పడుతూ ఉంటే సొంత డబ్బుతో బోరు వేయించాడు 2008 లో,, అది ఇప్పటికి నీళ్లు అందిస్తుంది, ప్రాణాపాయం లో ఉన్న పావలా శ్యామలకి ఆర్థిక సాయం చేసాడు గోత సతీష్ అనే బైకర్ కి 5 లక్షలు ఇచ్చాడు, ఉత్తరాఖండ్ వరదలప్పుడు 20లక్షలు ఇచ్చాడు,


* బాపట్ల అబ్బాయ్ కామన్ వెల్త్ గేమ్స్ విజేత వెంకట రాహుల్ కి 11లక్షలు ఇచ్చాడు, అనంతపురానికి చెందిన రేఖ అనే అథ్లెట్ ఆర్ధికంగా ఇబ్బంది పడుతుంటే, ఆన్ ది స్పాట్ 5 లక్షలు ఇచ్చేశాడు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి  సైనికులకు ఫండ్ ఇచ్చిన తొలి సినిమా హీరో 20ఏళ్ళ కింద లక్ష రూపాయలు (తమ్ముడు సినిమా టైంలో) మళ్ళీ మొన్న ఏప్రిల్ లో సైనిక సంక్షేమ నిధికి కోటి రూ. ఇచ్చాడు, నిన్న గాక మొన్న పీఎం కేర్స్ కి కోటి, తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున మరొక కోటి ఇచ్చాడు.


ఇవి కొన్ని మాత్ర‌మే. ప‌వ‌న్ ఇంకా చాలా చేశాడు. చేస్తూనే ఉన్నాడు. గెలిస్తే న్యాయం చేస్తాం, లేదంటే సాయం చేస్తాం.. అన్న‌ది ప‌వ‌న్ ని అభిమానించే జ‌న సైనికుల సిద్ధాంతం. దాన్ని రాజ‌కీయాల్లోకి రాక ముందు నుంచే ప‌వ‌న్ న‌మ్ముతూ... ఆచ‌రిస్తూ వ‌చ్చాడు. అదీ ప‌వ‌నిజం అంటే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS