జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమి చేసినా సంచలనమే. నిజంగా ఇది అక్షర సత్యం, తనకున్న పేరు ప్రతిష్టలని తనకోసం కాకుండా అవసరంలో ఉన్నవారికి ఉపయోగించే అతికొద్ది మందిలో ఒకడు పవన్ కళ్యాణ్.
వివరాల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్ ని ఈ రోజు సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాలకి సంబందించిన చేనేత కార్మికులు కలిసి తమగోడుని చెప్పుకున్నారు. వారి సష్టాలు విని చలించిపోయిన పవన్, వెంటనే చేనేత వస్త్రాలకు తను ప్రచారకర్తగా వ్యవహరిస్తానని వారికి హామీ ఇచ్చాడు.
దీనితో ఆగకుండా, మంగళగిరిలో వచ్చేనెల జరగబోయే చేనేత సత్యాగ్రహానికి ముఖ్య అతిధిగా హాజారవుతానని వారికి మాట కూడా ఇచ్చాడు. పవన్ కి ఉన్న పాపులారిటీ దృష్ట్యా అతను తలుచుకుంటే అతిపెద్ద బ్రాండ్లకి ప్రచారకర్తగా మారి కోట్లు మూటకట్టుకోవచ్చు అలాంటి పవన్ ఇలా కష్టాల్లో ఉన్నవారికి తోడూ నిలబడటం నిజంగా అభినందిచాల్సిన విషయం.