పవన్‌కళ్యాణ్ సినిమా కెరీర్‌లో సూపర్ హిట్ అయిన పాటలతో 'దేశ్ బచావో' అనే టైటిల్‌తో కూడిన మ్యూజిక్ ఆల్బమ్‌ని రూపొందించారు. డిజె పృధ్విసాయితో కలిసి జనసేన పార్టీ ఈ ఆల్బమ్‌ని రూపొందించడం జరిగింది. ఇందులో ముందుగా విడుదలైన పాట 'ట్రావెలింగ్ స్టోరీ' చాలా లౌడ్‌గా, మంచి బీట్స్‌తో ఉంది. బాంగ్రాని మిక్స్ చేశారు. అలాగే పవన్‌కళ్యాణ్ వాయిస్ ఈ పాటలో హైలైట్. అయితే ఆల్బమ్ కోసం పవన్ పాటలు పాడలేదు. పాత పాటల్నే వినియోగించారు. అందులో పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ప్రసంగాల్ని మిక్స్ చేయడం దీనికి ప్రత్యేకతగా చెప్పవలసి ఉంటుంది. రెండో పాటగా 'నారాజుగాకుర' అనే పాటని 'జానీ' సినిమా నుంచి తీసుకున్నారు. 'తమ్ముడు' సినిమాలోని 'ట్రావెలింగ్ సోల్జర్', 'జానీ'లోని 'నారాజుగాకర' ఆనాటి రోజుల్లో విపరీతంగా పాపులర్ అయిన పాటలు. ప్రస్తుత రాజకీయాలపై పాటాస్త్రం సంధించాలనే ఉద్దేశ్యం బాగున్నప్పటికీ ఓ పాటని తీసుకుని వాయిస్ మార్పులు చేయకుండా, కొంచెం మ్యూజిక్ చేంజ్ చేసేసి, పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ప్రసంగాల్ని మిక్స్ చేసేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ భారతదేశంపై ఉత్తరాది పెత్తనం అనే కోణంలో రాజకీయ విమర్శలు చేస్తున్న పవన్‌కళ్యాణ్, జనసేన పార్టీకి ఊపిరిలూదడం కోసమే ఈ ఆల్బమ్‌ని రూపొందించారని అర్థం చేసుకోవాలి.