రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై తెలుగు రాష్ట్రాల్లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ లీడర్ కూడా కావడంతో కామన్ గానే కామెంట్స్ రాజకీయ రంగు పులుముకున్నాయి. ఏపీ మంత్రులు, వైకాపా నాయకులు పవన్ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పెదవి విప్పకపోవడం కూడా చర్చనీయంశమైయింది. సినిమా పరిశ్రమ తరపున పవన్ మాట్లాడితే .. ఇండస్ట్రీ నుంచి ఒక్కరి సపోర్ట్ కూడా ఇంతవరకూ రాలేదు. పైగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పవన్ కళ్యాణ్ తో మాకు సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది.
''సినీ పరిశ్రమపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలు వేదికలపై చెబుతున్నారు. వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదు. చిత్ర పరిశ్రమను నమ్ముకుని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. కరోనా మహామ్మారి సహా వివిధ అంశాలపై తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమకు ఇరు రాష్ట్రాల సీఎంల మద్దతు కావాలి’’ అని ప్రకటనలో చెప్పుకొచ్చింది.
ఈ ప్రకటన గమనిస్తే పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో ఇండస్ట్రీ కి సంబంధం లేదని చాలా క్లియర్ గా చెప్పినట్లుగా వుంది. ఇండస్ట్రీ నుంచి పవన్ కు ఎలాంటి సపోర్ట్ రాలేదు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ చాలా వరకూ పొలిటికల్ గా సాగాయి. సినిమా వాళ్ళు పాలిటిక్స్ అంటే కొంచెం జంకుతారు. పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉన్నప్పటికీ అధికార పార్టీతో పెట్టుకోవడం అనవసరం అనే కోణంలో కూడా సైలెంట్ అయిపోయారనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటమే పోరాటమే కనిపిస్తుంది ప్రస్తుతానికి.