'గబ్బర్‌సింగ్' సినిమా విడుదలై అయిదేళ్ళు పూర్తయిపోయింది. సోషల్ మీడియాలో 'గబ్బర్‌సింగ్' డైరెక్టర్ హరీష్‌శంకర్, ఆ సినిమా ఐదేళ్ళు పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే అభిమానులు మాత్రం 'అయిదేళ్ళయిపోయింది, మళ్ళీ ఆ పవర్ ఎప్పుడు చూపిస్తావ్ హరీషన్నా' అని ప్రశ్నిస్తున్నారాయన్ని. పవన్‌కళ్యాణ్‌కి హరీష్ శంకర్ వీరాభిమాని. 'సర్దార్ గబ్బర్‌సింగ్' హరీష్ శంకర్ చేతికే రావాల్సింది. కొన్ని కారణాలతో అది సంపత్ నంది చేతికి వెళ్ళి, చివరకు బాబీ చేతుల్లో పడింది. పవన్ ఎప్పుడు పిలిచినా, మరో బ్లాక్‌బస్టర్ అందించేందుకు హరీష్ రెడీగా ఉన్నాడు. 'ఆ స్థాయి వేరు, ఆయన స్థానం వేరు' అని హరీష్, పవన్‌కళ్యాణ్ గురించి ఈ మధ్యనే సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి. అదీ, పవన్ మీద హరీష్‌కి ఉన్న అభిమానం. ఆ అభిమానంతోనే పవన్ ఓకే అనాలి గానీ మళ్లీ 'గబ్బర్ సింగ్'లాంటి సెన్సేషన్ మూవీని తెరకెక్కించెయ్యొడు. ప్రస్తుతం పవన్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరో పక్క హరీష్ శంకర్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 'దువ్వాడ జగన్నాధమ్' రిలీజ్‌కి రెడీగా ఉంది. పవన్ - హరీష్ అభిమానులు మెచ్చే ఆ కాంబినేషణ్ అతి త్వరలో రిపీట్ అయి, బాక్సాఫీస్ మీద మరోసారి ఈ ఇద్దరూ దండయాత్ర చేసార్తని ఆశిద్దాం.