పవన్ కళ్యాణ్ దేవుడిగా భావించేవాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. హీరోల దగ్గర్నుంచీ, టెక్కీషియన్స్ దాకా ఆయన్ని దేవుడిగా ఆరాధించేవాళ్ల లిస్టు చాలానే ఉంటుంది. అందులోనూ 'గోపాల గోపాల' సినిమా దగ్గర్నుంచీ పవన్ కళ్యాణ్‌కి ఈ పేరు సార్ధక నామధేయం అయిపోయింది. ఆ సినిమాలో పవన్‌ని దర్శకుడు డాలీ దేవుడిలా చూపించాడు. అప్పట్నుంచీ ఆ చిత్ర యూనిట్‌కి నిజంగానే పవన్ దేవుడిలా మారిపోయాడు. ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన డాలీకి దర్శకుడిగా మరో ఛాన్స్ ఇచ్చాడు. అదే 'కాటమరాయుడు'. ఇదే చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన అనూప్ రూబెన్స్ 'గోపాల గోపాల' చిత్రానికి కూడా సంగీతం అందించాడు.
ఇలా ఈ సినిమాతో చాలా మందికి దేవుడైన పవన్ కళ్యాణ్ తాజాగా ఈ సినిమాకి హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేసిన రామ్ కొనికికి కూడా దేవుడయ్యాడు. ఎందుకంటే హైఫై టెక్నాలజీతో రామ్ ఓ సెలూన్‌ని ప్రారంభించాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంతేకాదు ఈ సెలూన్ ప్రారంభించడానికి రామ్‌కి ఆర్థిక సహాయం కూడా పవన్ అందించి ఉంటారని సమాచారమ్. పవన్ ఎన్నో గుప్తదానాలు చేస్తూ ఉంటారు. కానీ అవేమీ బయటికి చెప్పడానికి ఆయన ఇష్టపడరు. అలాంటి వాటిలో ఇదీ ఒకటి కావచ్చంటున్నారు ఆయన సన్నిహితులు. అంతేకాదు పవన్ గుప్త దానాల్లో ఇది కూడా ఒకటని రామ్ స్వయంగా తెలిపారు కూడా.