దటీజ్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ స్టామినా. 'గబ్బర్‌సింగ్', 'అత్తారింటికి దారేది', 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రాలతో 50 కోట్ల మార్క్‌ని ఆల్రెడీ దాటేసిన పవన్‌కళ్యాణ్, ఆ క్లబ్‌లో తాజాగా మరో చిత్రాన్ని చేర్చాడు. 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమాకి అనుకున్నంతమేర టాక్ రాకపోయినా, 50 కోట్లు దాటి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు 'కాటమరాయుడు'తో 50 కోట్లు దాటేయడం ద్వారా సరికొత్త రికార్డ్ సృష్టించాడు పవన్‌కళ్యాణ్. ఈ వీకెండ్‌లో 'కాటమరాయుడు' ఇంకెంత వసూలు చేయనున్నాడోగానీ, అన్నీ కలుపుకుంటే 70 కోట్ల నుంచి 80 కోట్లపైనే కాటమరాయుడు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇంకొందరైతే 100 కోట్లు దాటడం 'కాటమరాయుడు'కి పెద్ద కష్టం కాబోదని విశ్లేషిస్తుండడం గమనించదగ్గది. అయితే, ఆ స్థాయిలో 'కాటమరాయుడు' ప్రభంజనం ఉండకపోవచ్చునేమో. ఎందుకంటే మార్చి 31 నుంచి వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. వాటి ప్రభావం 'కాటమరాయుడు'పై ఎంతో కొంత ఉండకపోదు. ఏదేమైనప్పటికి 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'కాటమరాయుడు' చిత్రానికి ఈ స్థాయి వసూళ్ళు ఓ ప్రభంజనంగా భావించవలసి ఉంటుంది. 'కాటమరాయుడు' చిత్రానికి డాలీ దర్శకుడు కాగా, శృతిహాసన్ ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసినదే కదా.