పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాల్లోనూ మరో పక్క సినిమాల్లోనూ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర యువత నిర్వహిస్తోన్న భారీ నిరసనలో పవన్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ లోగా 'కాటమరాయుడు' షూటింగ్ కోసం హైద్రాబాద్ శివార్లలోని ఓ దేవాలయంలో సందడి చేశారు. అక్కడ షూటింగ్ తిలకించడానికి వచ్చిన జనానికి పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఆనందపరిచారు. ఈ షూటింగ్లో హీరోయిన్ శృతిహాసన్‌తో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఒక పక్క షూటింగ్‌కి బ్రేక్ లేకుండా, మరో పక్క సోషల్ మీడియాలో కూడా బ్రేక్ లేకుండా ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా నిరసన జోరు మొదలైన నాటి నుండి పవన్ సోషల్ మీడియాలో చాలా హుషారుగా ఉన్నారు. వరుస పెట్టి ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తూ యువతకు ఉత్సాహాన్ని అందిస్తున్నారు. పవన్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తోనే ఆంధ్ర యువత అంతా జనవరి 26న జరగనున్న భారీ నిరసన కార్యక్రమానికి తగిన కసరత్తులు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు యంగ్ సినీ నటులు కూడా మద్దతునిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తాము కూడా హాజరై మా వంతు సపోర్ట్‌ని అందిస్తామంటూ సోషల్ మీడియాలో స్వీట్ ట్వీట్లతో హల్చల్ చేస్తున్నారు.