అటు వకీల్ సాబ్ నీ, ఇటు క్రిష్ తో సినిమానీ ఒకేసారి మొదలెట్టాడు పవన్ కల్యాణ్. లాక్ డౌన్ వల్ల రెండు సినిమాలూ ఆగిపోయాయి. ఎట్టకేలకు `వకీల్ సాబ్` మొదలవ్వబోతోంది. ఇది పూర్తి చేసి క్రిష్ సినిమా షూటింగ్ మొదలెడతారని భావించారు సినీ జనాలు.కానీ.. క్రిష్‌ని పవన్ బొత్తిగా పట్టించుకోవడం లేదని టాక్. ఇటీవల దిల్ రాజు - పవన్ ల మధ్య భేటీ జరిగింది.
`వకీల్ సాబ్` షూటింగ్ కి వస్తానని పవన్ చెప్పడం, దిల్ రాజు అందుకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగిపోయాయి. అక్టోబరులో పవన్ సెట్స్‌పైకి రాబోతున్నాడు. అయితే క్రిష్ కి మాత్రం పవన్ పెద్దగా రెస్పాండ్ అవ్వడంలేదట. క్రిష్ కూడా పవన్‌పై ఏమాత్రం నమ్మకం పెట్టుకోలేదు. అందుకే ఈలోగా మరో సినిమా మొదలెట్టాడు. వకీల్ సాబ్ పూర్తయినా కూడా పవన్ - క్రిష్ సినిమా మొదలయ్యే ఛాన్సులేదని, తాత్కాలికంగా ఈసినిమాని పక్కన పెట్టి, మరో ప్రాజెక్టుని పట్టాలెక్కించినా ఆశ్చర్యం లేదని టాలీవుడ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే... క్రిష్ సినిమా మొదలవ్వడం కష్టంగానే అనిపిస్తోంది.