పవన్ కల్యాణ్ జోరు పెంచాడు. మొన్ననే పింక్ రీమేక్‌కి శ్రీకారం చుట్టిన పవన్.. ఇప్పుడు క్రిష్ సినిమానీ మొదలెట్టేశాడు. క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసింది. ఏఎం రత్నం నిర్మాత. ఈరోజే ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిరాడంబరంగా షూటింగ్ మొదలైంది. ఫిబ్రవరి 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుంది. అయితే పవన్ మాత్రం `పింక్` సినిమా పూర్తయ్యాకే క్రిష్ సినిమా షూటింగ్‌లో పాలుపంచుకుంటాడు.
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ ని రూపొందించారు. తొలి షెడ్యూల్ మొత్తం అక్కడే జరగబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.