పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఏ.ఎం.రత్నం నిర్మాత. జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కథానాయికగా నటిస్తోంది. `కోహినూర్` వజ్రం చుట్టూ తిరిగే కథ. పవన్ ఓ దొంగగా కనిపించనున్నాడు. ఈచిత్రానికి `విరూపాక్ష` అనే టైటిల్ పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అయితే అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఇప్పుడు మరో టైటిల్ బయటకు వచ్చింది. అదే.. `హరి హర వీర మల్లు`.
ఈ సినిమాలో కథానాయకుడి పేరు వీరమల్లు. అందుకే ఆ టైటిల్ పెడితే ఎలా ఉంటుందా? అని క్రిష్ ఆలోచనలో పడ్డాడు. 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలన్నది ప్లాన్. అప్పటికి ఇంకా చాలా సమయం ఉంది. అందుకే టైటిల్ విషయంలో చిత్రబృందం కంగారు పడడం లేదు. ఓ ఫీలర్ లా వదిలి, అభిమానుల అభిప్రాయం తెలుసుకోవాలనే చిత్రబృందం `హరి హర వీరమల్లు` అనే పేరు వదిలిందేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.