హీరోయిన్ రేణూ దేశాయ్‌తో సహజీవనం చేశాక, 2009 ఎన్నికలకు ముందు టైంలో ఆమెని అధికారికంగా పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 'ప్రజారాజ్యం' పార్టీ టైంలో ఆ పార్టీకి యూత్ వింగ్ అధ్యక్షుడిగా బాథ్యతలు నెరవేర్చినప్పుడు, రేణూ దేశాయ్ పవన్‌కి మోరల్ సపోర్ట్‌గా నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ స్థాపించడం, ఆ టైంలో అన్నా లెజినోవాతో పెళ్లి విషయం అధికారికంగా వెలుగులోకి రావడం జరిగింది. ఇదిలా ఉండగా, తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజాయాత్ర ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. దీని నిమిత్తం తన భార్య అయిన అన్నా లెజినోవా పవన్‌కి వీర తిలకం దిద్దారు.
అన్నా లెజినోవా రష్యన్ మహిళ. ఆమెకు కుంకుమ ఎలా దిద్దాలో పవన్ కళ్యాణ్ దగ్గరుండి చెప్పి చేయించుకున్నారు. అలాగే హారతిచ్చి, కొబ్బరి కాయ కొట్టడం తదితర అంశాలను పవన్, లెజినోవాకి వివరించి చెప్పి, చేయించారు. అయితే గతంలో 'ప్రజారాజ్యం' టైంలో రేణూ దేశాయ్ తెర వెనుకే ఉండి పవన్‌కి సపోర్ట్ ఇచ్చారు కానీ, బయటికి వచ్చి, కనిపించింది లేదు. ఈ సారి అలా కాదు, పవన్ కళ్యాణ్ భార్య లెజినోవాని రాజకీయంగా బాగా హైలైట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ రోజు కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు తెలంగాణాలో ప్రజాయాత్ర ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే అన్నా లెజినోవాతో ఈ తతంగం అంతా చేయించుకున్నారు పవన్ కళ్యాణ్. తిలకం దిద్ది, హారతిచ్చినాక ప్రేమతో భార్యను దగ్గరకు తీసుకుని యాత్రకు బయల్దేరారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.