పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ అందుకే ఆపేశాడు..

By iQlikMovies - March 15, 2018 - 13:03 PM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన చిత్రం ‘సత్యాగ్రహి’. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే నిలిచిపోయింది. దీనికి గల కారణాలు ఎవ్వరికీ తెలియదు. 

ఇక ఆ చిత్ర ప్రకటించినప్పుడే చాలా పెద్ద ఎత్తున్న ప్రచారం లభించింది. కారణం- పవన్ కళ్యాణ్ ఆ కథని రచించడం అలాగే దర్శకత్వ బాధ్యతని కూడా తీసుకోవడమే. అప్పుడు ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాల్సింది.

ఇవన్ని పక్కనపెడితే, ఇన్ని సంవత్సరాల తరువాత ఈ సినిమా ఆగిపోవడానికి అసలు కారణాన్ని బయటపెట్టాడు. రాజకీయాలని ప్రశ్నిస్తూ ప్రజలని ఆలోచింపచేసే కథ తీసి సమాజంలో మార్పు తేవాలనే ఉద్దేశ్యంతో ఆ సినిమా తీయాలని అనుకున్నాడట.

అయితే ఒక సినిమా వల్ల ప్రజల్లో అలాగే రాజకీయాల్లో మార్పు సాధ్యం కాదని కేవలం ప్రజాక్షేత్రంలోకి వెళితేనే మార్పు సాధ్యం అని నిర్ణయానికి వచ్చి ఆ చిత్రాన్ని పక్కన పెట్టేసినట్టు చెప్పాడు. దీనితో ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దాని పైన క్లారిటీ వచ్చింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS