ప‌వ‌న్ రీ ఎంట్రీకి రంగం సిద్ధం.. వచ్చేనెల‌లో కెమెరా ముందుకు

By Gowthami - January 09, 2020 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని మ‌ళ్లీ వెండి తెర‌పై చూడాల‌ని అభిమానులంతా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ప‌వ‌న్ చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఏదో ఒక‌టి త్వ‌ర‌లో కొబ్బ‌రికాయ కొట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని అభిమానుల న‌మ్మ‌కం. ఇప్పుడు ఆ న‌మ్మ‌క‌మే నిజం కాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 10 నుంచి `పింక్` రీమేక్ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అన్న‌పూర్ణ స్డూడియోలో ఓ భారీ సెట్ ఈ సినిమా కోస‌మే తీర్చిదిద్దుతున్నారు.

 

అక్క‌డే షూటింగ్ మొద‌లు కాబోతోంది. తొలి ప‌ది రోజుల్లో ప‌వ‌న్ లేకుండానే స‌న్నివేశాలు పూర్తి చేస్తారు. ఆ త‌ర‌వాత ప‌వ‌న్ సెట్లో అడుగుపెడ‌తాడు. ఏప్రిల్ చివ‌రికి ఈ సినిమాని పూర్తి చేయాల‌ని, వేస‌వికి విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం ప్లాన్ చేస్తోంది. తాప్సి పోషించిన పాత్ర‌లో నివేదా థామ‌స్ క‌నిపిచంచ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `మ‌ల్లేశం` ఫేమ్ అన‌న్య కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. అంజలికీ ఓ పాత్ర ద‌క్కింది.

 

ముగ్గురు అమ్మాయిల క‌థ ఇది. ఆ ఆ ముగ్గురు అమ్మాయిలూ ఫిక్స‌యిపోయారు. ఈ ముగ్గురి మ‌ధ్య స‌న్నివేశాల‌తోనే షూటింగ్ కూడా ప్రారంభించ‌బోతున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS