నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. అయితే ఆ ప్రమాదంలో నిశిత్ ప్రయాణిస్తున్న కారు ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉపయోగించినది అని సోషల్ మీడియాలో న్యూస్ రావడం మొదలయింది.
అయితే కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ దీని పై క్లారిటీ ఇచ్చాడు. నిశిత్ వాడిన కారు తనది కాదని, కాకపోతే అదే మోడల్ కారు తనకి ఒకప్పుడు ఉండేది అని తెలిపాడు. అయితే దానికి సంబందించిన EMIలు కట్టలేక ఆ కారుని అమ్మేశానని తెలిపాడు.
దీనితో ఈ కారు కాంట్రవర్సీ పై వస్తున్న కధనాల పై క్లారిటీ వచ్చేసింది. అయినా ఈ మధ్యన సోషల్ మీడియాలో సైతం ఇటువంటి ఫేక్ న్యూస్ ఎక్కువ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.