మేనల్లుడితో పవర్‌స్టార్‌ సినిమా!

మరిన్ని వార్తలు

పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాని సొంత బ్యానర్‌లో నిర్మించాడు. తాజాగా మరో సినిమాని నిర్మించనున్నాడు. అదే యంగ్‌ హీరో నితిన్‌తో చేయబోయే చిత్రం. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి, నితిన్‌ హీరోగా ఓ సినిమాని పవన్‌ తన సొంత బ్యానర్‌లో నిర్మించనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పటికే అనౌన్స్‌ అయ్యింది కూడా. ఇది కాక త్వరలో పవన్‌ నిర్మాతగా ఇంకో సినిమా ప్రారంభం కానుందట. ఆ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ హీరోగా నటించనున్నాడని సమాచారమ్‌. పవన్‌ నిర్మాతగా చరణ్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుందని గతంలో గాసిప్స్‌ వినవచ్చాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు. అభిమాని అయిన నితిన్‌ కోసమే సినిమా నిర్మించాలని అనుకున్నాడు పవన్‌. మరి తనకెంతో ఇష్టమైన మేనల్లుడి గురించి సినిమా తెరకెక్కించడంలో అభ్యంతరాలేముంటాయి. అయితే ఈ కాంబినేషన్‌లో రాబోయే చిత్రానికి పక్కా స్టోరీ కోసం వెయిటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీగా ఉంది. తర్వాత కూడా పవన్‌ చేతిలో చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మరో పక్క తేజు కూడా సూపర్‌ బిజీగానే ఉన్నాడు. మరి చూడాలిక సాయిధరమ్‌ తేజ్‌తో పవన్‌ సినిమా ఏమవుతుందో !


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS