పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో దాదాపు గంటసేపు మాట్లాడారు. మీడియా, సినిమా, రాజకీయం ఇలా అన్ని అంశాలపై ఘాటుగా పవర్ పంచులు ఇచ్చారు. ముఖ్యంగా మీడియాని కడిగిపారేశారు. '' తేజ్ ప్రమాదానికి గురైతే అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కానీ తేజ్ ఆక్సిడెంట్ ఎలా అయింది, నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు.. అని లేనిపోని కథనాలు మీడియాలో అల్లారు.
సమాజంలో చాలా సమస్యలున్నాయి వాటి మీద మాట్లాడండి. మీడియా బాధ్యతాయుతమైన కథనాలు ఇవ్వాలని సూచించారు పవన్ అంతేకాదు మీడియాకి కౌంటర్ ఇస్తూ... వైఎస్ వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు?కోడికత్తితో ఒక నాయకుడిని పొడవడం వెనక భారీ కుట్ర ఉంది. ఆరేళ్ల చిన్నారిపై అమానుషంపై కథనాలు ఇవ్వండి'' అనే చురకలు అంటించారు.
అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ మెగా అభిమానుల్లో టెన్షన్ పెంచింది. సాయి తేజ్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ''సాయి ధరమ్ తేజ్ కోమాలోనే వున్నాడు, ఇంకా కళ్ళు తెరవలేదు'' అని చెప్పుకొచ్చారు. ఈ మాటతో సాయి ఆరోగ్యంపై మరిన్ని అనుమానులు తెరపైకి వచ్చాయి. అపోలో హాస్పిటల్ లో వున్నాడు తేజు. తేజు ఆరోగ్యం పై రెగ్యులర్ అప్డేట్స్ రావడం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలతో అసలు తేజుకి ఎలా వుందనే టెన్షన్ మొదలైయింది అభిమానుల్లో.