'కెవ్వు కేక'.... గబ్బర్ సింగ్ లోని మంచి మాస్ సాంగ్ ఇది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లయినా ఈ పాటని ఎవరూ మర్చిపోలేరు. మంచి డాన్స్ బీట్ ఉన్న ఈ పాట ఇప్పటికీ చాలా వేడుకల్లో హల్ చల్ చేస్తుంటుంది. అయితే ఈ పాట చేయడానికి తాను చాలా ఇబ్బంది పడ్డా అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్ బలవంతం పై ఈ పాట చేయాల్సివచ్చిందని చెప్పుకొచ్చాడు. `వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ ఈ పాట గురించి గుర్తు చేసుకున్నాడు.
తనకు దేశభక్తి పాటలంటే చాలా ఇష్టమని, తన సినిమాల్లో ఏదో ఓ రకంగా ఆ పాటల్ని ఇరికించాలని చూసేవాడినని గుర్తు చేసుకున్నారు. ``అలాగని ఐటెమ్ గీతాలకు నేను వ్యతిరేకిని కాదు. అభిమానుల కోసం అవి కూడా చేయాలి. కాకపోతే.. దేశభక్తి గీతాలంటే ఇంకా మక్కువ`` అని చెప్పుకొచ్చారు. సంగీతంపై తనకున్న ప్రేమని కూడా పంచుకున్నారాయన. కొంతకాలం తాను కర్నాటక సంగీతం నేర్చుకున్నానని, పాటలంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.
ప్రఖ్యాత సంగీత కారుడు.. శివమణి వేదికపైనుంచి పవన్ ని ఆహ్వానించి... తనతో పాటు డ్రమ్స్ వాయించమని కోరారు. పవన్ ... డ్రమ్స్ స్ట్రిక్స్ పట్టుకుని కాసేపు.. శివమణిని అనుసరించారు. ఈ దృశ్యాలు అభిమానుల్ని అలరించాయి.